Alamelu Mangamma

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singers : Madhavi Ravuri : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : అలమేలు మంగమ్మ

"పల్లవి" : అలమేలు మంగమ్మ తలపుల నీవమ్మ
తలపలోక నిలయవట మా తలపుల వాకిట నీవట "అలమేలు"

"చరణం" : పలుకుల తేనెలధారల పదముల మువ్వలు భళిరా!
పాలపొంగువోలె నవయవ్వన తారవు ఛాయవు “2”
పాలసంద్ర నిలయవు పరువాల వెల్లినీవు
పాలముంతల కొలువా పాల పుంతల ఛాయవా! "అలమేలు"

"చరణం" : పూలవంటి పరిమళము మేని సొగసు అతివా!
తలవంచి సిగ్గుపడు పూల తోటలే మగువా! “2”
కిలకిల నగవుల మల్లెలు గుసగుసలాడేనులే!
అల్లనల్లన చందురుడే మబ్బులలో దాగెనులే! "అలమేలు"

"చరణం" : అచ్యుతుడే నీవాడు అలమేలు మంగమ్మా!
మచ్చికతోడనె నీవు మనువాడినావమ్మా! “2”
అచ్చెరువందగ నీవు అలమేలు మంగాపురమున
నచ్చి వచ్చి నిలచినావు వరముల నిధివైనావు "అలమేలు"

Category

🎵
Music