Sayujyam Neevaithe

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Madhavi Ravuri : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : సాయుజ్యము నీవైతే

"పల్లవి" : సాయుజ్యము నీవైతే సాయం మాకెందుకు
కైవల్యము నీవైతే కోరికలింకెందుకు "2"

"అ.ప." : కోరికల కడలిలోన దిక్చూచివినీవే!
అంతుతెలియనీ తీరపు అంచువు నీవే! "సాయు"

"చరణం" : సిరిసంపదలు మాకు బ్రతుకుతెరువుకేలే!
సిరితోగూడిన నీవు కారుణ్యనిధివేలే! హరీ! “2”
రారాజువు నీవైతే పదవులు ఇక మాకెందుకు
సామ్రాజ్యము నీదైతే పట్టము మాకెందుకులే "సాయు"

"చరణం" : ఆకాశవీధిలోన వెలిగే భాస్కరుడవు నీవె!
నీ వెలుగుల కిరణముల విరిసే తామరలు మేము హరీ! “2”
తామరాకు మీద జారు నీటిబిందువే నీవు, ఆ
బిందువు కొరకై వేచే చకోరమే మేము "సాయు"

Category

🎵
Music