Rayilonaneeve

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : రాయిలోన నీవే

"పల్లవి" : రాయిలోన నీవే, ప్రతిస్థాయిలోను నీవే
వేయినామాల స్వామి! రేయ్యింబవళులు నీవే! "2"

"చరణం" : కొండలలో నీవే, మా డెందములో నీవే!
కొండలనన్నింటిలోన ఏడుకొండలు నీవే!
ఫలములలో నీవే, ప్రతిఫలమైనను నీవే!
ఫలసముదాయములలో తియ్యందనము నీవే! "రాయిలోన"

"చరణం" : రేణువులో నీవే! వేణువులో నీవే!
ప్రాణాధారమైన నీరములో నీవే
అంతరాత్మలలో అమృతము నీవే!
ఆత్మజ్యోతివి నీవే, అంతర్యామివి నీవే! "రాయిలోన"

"చరణం" : తరువులలో నీవే! ప్రతి మేరువులో నీవే!
మేరువులన్నింటిలోన వేంకట మేరువుయొకటే!
జీవులలో నీవే! చిరంజీవివైనావే!
పరంజ్యోతిగా వెలిగే పరంధాముడవు నీవే! "రాయిలోన"

Category

🎵
Music