Settu Puttaku

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : A.P. Mythili : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :సెట్టూ పుట్టకు

"పల్లవి" : సెట్టూ పుట్టకు కారణమంట
సెట్టంత దైవము తానె యంట "2"

"అ.ప." : పట్టినపట్టు యిడువడంట
మనల పట్టభుధ్రులను సేయునంట "సెట్టూ"

"చరణం" : ఆడను ఈడను ఆవరించునంట
ఆడుతు పాడుతు బతుకమంటడoట “2”
ఆడేగా మన తోడు యంట
వీడడుగా మరి జనమల సివరగ "సెట్టూ"

"చరణం" : మదిలో నుండగ భయము యేలరా! మరి
బదులుగ తాను ఏ మడుగడురా! “2”
మదముతొ నీవు మాట మీరినను
ముదముతొ నిన్ను కడతేర్చునురా! "సెట్టూ"

"చరణం": జలజనేత్రి తోడు తానె యంట!
జలములొ నెపుడు కొలువుండునంట “2”
జలజల కన్నీరు గార్చిన నీవు
జాలమువలె నిన్ను అల్లుకొనునుగా! "సెట్టూ"

"చరణం": వైకుంఠము మరి యేడొ లేదురా! తాను
అంటి యుండునదె వైకుంఠమేరా! “2”
జంటగ నీకు వాడు యుండిన
ఒంటిరాయివి గానే గాదురా! "సెట్టూ"

Category

🎵
Music