Naa Manasame

  • 4 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Madhavi Ravuri : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : నా మానసమే

"పల్లవి" : నా మానసమే వూయల, పసిపాపడవై వూగేవు
ఆడుతు పాడుతు తిరిగినను పరవశింపజేశేవు "2'

"చరణం" : నీ బోసినవ్వులు నను మైమరపించే
ఆకలిదప్పులు గురుతు సేయబోవులే!
నీ కిలకిలల అమృతమే నా దప్పికను దీర్చునులే!
నీ పలుకుల పరమాన్నం నాకడుపును నింపునులే "నా మనసే"

"చరణం" : నీ అడుగు తడబాటే నను సరిజేయునులే!
నీ వురుకు పరుగులే నా యోచనలే!
నీ లేత జేవేళు అర్చింప చిహ్నములే! “2”
నీ పవళింపు స్థానమే నా వైకుంఠధామమే "నా మనసే"

"చరణం" : నీ తొలిఅడుగు ఆకాశమంత ఆనందం
నీ మలిఅడుగు పుడమియే పులకితము
నీ అడుగులా నా అడుగు ఆనందం “2”
ఆనందనందనా! నా ప్రతిఅడుగు నీ మయమే "నా మనసే"