Parijathamu Needalo

  • 4 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Ramana Ceelam : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : పారిజాతము నీడలో

"పల్లవి" : పారిజాతము నీడలో పరమాత్ముని సన్నిధిలో
పరవశించెను నా మనసే పరిపరివిధముల "2"

"చరణం" : ఆ చల్లని కన్నుల ఆనందపుటంచుల
తిలకించి పులకరించె అవ్యాజ కరుణల “2”
కారుణ్యమూర్తిగా మనమున తోచెనలా
కరుణాసాగరమై దేహమంతా తడిపెనలా! "పారిజాతము"

"చరణం" : రాధమ్మ నయనాల స్వామి మెరసెను మిల మిల
ఆ గొపెమ్మ వెన్నలా స్వామి కరిగెను కరుణల “2”
ఈ దేవమ్మ హృదయమే పీఠమై నిలచెనిలా
దేవదేవుని కరుణయే జగమంతా చిందెనిలా! "పారిజాతము"

"చరణం" : బృందావనమున తరులు బృందమై వూగెనలా!
ఆనంద నందనుడే విరితావుల మెరిసెనలా! “2”
భక్తి సామ్రాజ్యమే ఏలెను యీ భువినిలా!
రారాజై ఆ నగధరుడే లక్ష్మమ్మ నేలెనిలా! "పారిజాతము"