Vennanti Unduvadu

  • 4 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :

వెన్నంటి యుoడు వాడు

"పల్లవి" : వెన్నంటి ఉండు వాడు, వెన్నెల రాయుడు
వెన్నవంటి మనసువాడు కోనేటిరాయుడు "2"

"చరణం" : ఎన్నెన్నో పుణ్యఫలము, లెన్నెన్నో జన్మఫలము
అన్నియును తీరునులే, అంకెలేమి సరిరావులే!
అన్నియుగాలలోను ఆతడే దైవములే! నిజములే!
మనయోగభాగ్యములే! మనకందినాడులే! "వెన్నంటి"

"చరణం" : యుగపురుషుడు ఆయెనులే! మొగమాటములేదులే!
మొగలిపొదన ముళ్ళైనను మరుమల్లెలాయనులే!
అనిరుద్ధునకు సాటి దైవమే యిలను లేదులే!
ఉద్ధరిణి నీరైనను మనలనుద్ధరించువాడులే! "వెన్నంటి"

"చరణం": స్థాణువు కైనను లలిత మార్దవ మిచ్చేను
చిరాయువు జేయును చిరకాలము నెలవుంచును
ఆయువు తానే మన చాయయును తానే
కాయము తోనే మనలను పరమపధము చేర్చును""వెన్నంటి"