Samanyudugadule

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Sobanbabu Ganta: Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :సామాన్యుడు గాడులే

"పల్లవి": సామాన్యుడు గాడులే! వీడు మాన్యుడే!

"అ.ప.": అసామాన్య మహిమల ఆశ్రితమంజులుడే!

"చరణం":సాధారణ మనిషిని మనీషిగా సేయునులే!
అసాధారణముగా ఆతని మదిలోన నిలుపునులే!
ఆదరణ సాదరణ తానుగా నిలుచునులే!
ఆద్యంత్యము తానై మనలను నడిపించునులే! "సామాన్యుడు"

"చరణం": కారణము తానే మరి కారకము తానే!
కారణము తానైనను మిగుల మిన్నకుండునులే!
శొధన, సాధనతో జగతిని నడిపించునులే!
సాయుజ్యము తానై సాయమందించునులే! "సామాన్యుడు"

"చరణం": కలియుగమున వెలసినాడు కలిమలహరుడే వీడు
కలకాలము మనల వెన్నంటి నడిపించువాడు
చలచల్లని మలయాచల మలయప్పయే వీడు
అల్లన మెల్లన యుల్లము నిండుగ నుండెడు ఱేడు "సామాన్యుడు"

Category

🎵
Music