Mee Santhoshame

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Ramana Ceelam : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : మీ సంతోషమే

"పల్లవి" : మీ సంతోషమే నాకు సంతసము
మీకును నాకును గలదు విడదీయరాని బంధము "2"

“చరణం" : తల్లి వడిలోని బిడ్డలవలె నాకు, మీరు
లాలించే తల్లి నేను నా లోకమే మీరు
దండించే మనసులో ప్రేమఅనే యేరుపారు
బంధముతో మనసునే చుట్టి వేయు మేరుతీరు "మీ"

"చరణం" : మీ ఉన్నతి గోరులే నా మనంబు ఎన్నడును
శిష్టులు దుష్టులను బేధమేల కానగలను
సామ దాన బేధ దండోపాయముల నేను
మీ బాగోగులనే గోరు, కలవర పడుదు నిరతము నేను "మీ"

"చరణం" : దేవ దేవుని వినతిని వినుమా! మానవా!
ఓ సుమతీ! పొందవలె నీవు ఎనలేని సద్గతి
మతిమాలి విడువకుమా నీవు దేవుని జతి
మరువకుము మనమందరము ఆ దేవుని సంతతి "మీ"

Category

🎵
Music