Pasipaapadi

  • 3 years ago
Sudhanva Sankirtanam : Devotional Album : Singer : A.P. Mythili : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : పసిపాపడి నగవు

"పల్లవి" : పసిపాపడి వంటి నగవు పసి నిమ్మపండు నగవు
వసివాడని నవ్వు మిసి మిసి రవ్వలు రువ్వు "పసి"

"చరణం" : జగముల నేలే నగవు జలతారు వంటినగవు
జగన్నాయకుని నగవు జాబిలి నవ్వు “2”
జలజనయనుని నగవు జలపాతం నగవు
జల జల ముత్యాలు నేల జాలువారు నగవు "పసి"

"చరణం" : సర్వ శుభముల నగవు శుభాశీశ్శుల నగవు
సూర్య కాంతి నగవు సొంపైన నవ్వు “2”
చంద్రుని వంటి నగవు శిశిరకాంతి నగవు
శిశుపాలుని మర్దించి లోకము గాచిన నగవు "పసి"

"చరణం" : రుక్మిణమ్మ మనము దోచి దోబూచు లాడేనగవు
రుక్మి గుండెలలోన గర్జన నగవు “2”
రివ్వున విరులే రువ్వు, మెల్లని ఆ నవ్వు
అవురా! జగమే గాచే జిగేలుమను నవ్వు " పసి"

Category

🎵
Music