Kshirambudhilo - Laxmi Gayathri

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KSHIRAMBUDHILO

పల్లవి : క్షీరాంబుధిలో, క్షీరప్రియుండు
కొలువైయున్నాడు, స్వామిని చూడరొ జనులాలా [2]

చరణం : చక్కదనము తోడ, చక్ర ధరియె వాడు
చక్కని తల్లి ప్రియ చెంగల్వె వాడు [2]
చక్కని, చిక్కని నగవుల ఱేడు
చక్కనయ్యా! అని పొగడరే మీరు [2]
చక్కనయ్యా! అని పొగడరే జనులాలా [క్షీరాంబుధి]

చరణం : చెక్కిలి, చెక్కుల, తళుకు బెళుకు వాడు
చుక్కానిగ మము నడిపించు వాడు [2]
చుక్కల నింగిన, చల్లని ఱేడు
చల్లనయ్యా అని పిలువరే మీరు [2]
చల్లనయ్యా అని పిలువరే జనులాలా [క్షీరాంబుధి]

చరణం : రమకు విభుడె వాడు రమణీ ప్రియ వాడు
రసాంబుధిలో ఓల లాడించువాడు [2]
రస రమ్యముల గాన లోలుడె వాడు
రాధా లోలా యని పాడరె మీరు [2]
రాధా లోలా యని పాడరె జనులాలా [క్షీరాంబుధి]

Category

🎵
Music