Kolachina Vaariki - Raman Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : KOLACHINA VAARIKI

పల్లవి : కొలచిన వారికి, కొలచిన తీరుల కొలువని వారికి, కొలచేటి రీతుల "2"

అ.ప : నీ దివ్యకరుణల, నడయాడే వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన"

చరణం : కొండంత ఫలము, కొండంత బలము
కోనేటి రాయుడె, మా కొండంత దైవము "2"
యేడు కొండలలో, కొలువైవున్నాడు "2"
కొండల రాయుడె, మా కులదైవము
వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2"

చరణం : అన్నింటను, నీ అండయే వున్న
ఇలనిది లేదను, చింతయే కనము "2"
కైవల్య పదమునకు, కారణ భూతుడు "2"
మూర్తీభవించిన, కారుణ్య జలనిథి
వేంకటరమణా, వేదనారాయణా "కొలచిన" "2"

చరణం : ప్రాభాతవేళల, నీ పదాంబుజముల
సేవయె మాకు ఇహపర సౌఖ్యము "2"
కలియుగ మందున ప్రత్యక్షదైవమై "2"
వరములు కురిపించే, వరదాయకా
వేంకట రమణా, వేదనారాయణా "కొలచిన" "2"

Category

🎵
Music