• 7 years ago
Aaradhya Bachchan is accompanying mom Aishwarya Rai Bachchan at Cannes 2018. Aaradhya gives her mommy Aishwarya Rai Bachchan a kiss before she leaves for the red carpet.
#AishwaryaRaiBachchan
#Cannes2018
#AaradhyaBachchan

మాజీ ప్రపంచ సుందరి, ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యాయ్ రాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా ఈ ఫెస్టివల్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. తల్లితో పాటు అందంగా ముస్తాబై ఫోటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షిస్తోంది లిటిల్ బ్యూటీ ఆరాధ్య. ఫెస్టివల్ తొలి రోజు ఐష్ సీతాకోక చిలుక థీమ్‌తో డిజైన్ చేసిన డ్రెస్సులో మెరవగా, రెడ్ రోజ్ కలర్ గౌనులో ఆరాధ్య సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. ఫెస్టివల్ రెండో రోజు ఐష్-ఆరాధ్య సిల్వర్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయారు. ఫెస్టివల్‌కు హాజరయ్యే ముందు కూతురు ఆరాధ్యకు ఐష్ ఇచ్చిన ముద్దు ఫోటో వైరల్ అయింది. ముద్దు ఫోటో ఎంత క్యూట్‌గా ఉందో... .
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెలబ్రిటీల రేర్ మూమెంట్స్ తమ కెమెరాల్లో బంధించేందుకు అనేక మంది ఫోటోగ్రాఫర్లు కాచుకుని ఉంటారు. అందులో కొందరికి మాత్రమే అరుదైన మూమెంట్స్ దొరుకుతాయి. తన ప్రియమైన కూతురును ఐష్ ముద్దాడుతున్న ఫోటో ఒకటి కెమెరాకు చిక్కింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తొలి రోజు సీతాకోక చిలుక థీమ్ డ్రెస్సులో రెడ్ కార్పెట్ మీద సందడి చేసిన ఐశ్వర్యరాయ్... రెండో రోజు షిమ్మెరీ సిల్వర్ ఔట్ ఫిట్లో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ఆరాధ్య కూడా అచ్చం తల్లి మాదిరిగానే సిల్వర్ కలర్ డ్రెస్సు ధరించింది.
ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేయడం ఇది 17వ సారి. 44 ఏళ్ల ఐశ్వర్య యంగ్ జనరేషన్‌కు గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికీ తన హవా కొనసాగిస్తోంది.
తొలిరోజు సీతాకోక చిలుక ధీమ్‌లో మైఖేల్ సింకో డిజైన్ చేసిన డ్రెస్సులో ఐశ్వర్యరాయ్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారారు.

Recommended