• 7 years ago
The Tollywood sizzling actress Hebah Patel has finally signed a new film. The actress, who was last seen in 'Angel', has been roped in to play the lead role in Ayodhya Kumar's new film.

తన సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన హెబ్బా పటేల్‌కు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. కుమారి 21ఎఫ్,ఎక్కడికి పోతావు చిన్నవాడా మినహాయిస్తే.. ఆమె నటించిన ఆడోరకం ఈడోరకం, 'నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్', 'ఏంజెల్' సినిమాలు ఫ్లాప్స్ మూటగట్టుకున్నాయి. అయినా హెబ్బా చేతిలో మరో సినిమా వచ్చి పడింది.
'మిణుగురులు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నయోధ్య కుమార్ దర్శకత్వంలో 'శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్' అనే ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తాజాగా హెబ్బా పటేల్ ను ఓకె చేశారు.
'శ్రీలక్ష్మీ&24కిసెస్' సినిమాలో అవకాశంపై హెబ్బా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'కుమారి 21 ఎఫ్... తరహాలోనే '24 కిసెస్'లో కూడా నాది చాలా బోల్డ్ క్యారెక్టర్. ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుంది' అని హెబ్బా ధీమాగా చెబుతోంది.
'శ్రీలక్ష్మీ&24కిసెస్'లో బోల్డ్ సన్నివేశాలు పీక్ స్టేజ్ లో ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. హెబ్బా గ్లామర్ ను పూర్తిగా వినియోగించుకునేలా ఘాటైన సన్నివేశాలు ఉంటాయట. అయితే మరీ ఘాటు ఎక్కువైతే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా లో హీరోగా తేజ సజ్జా హెబ్బా సరసన నటిస్తున్నాడు.

Recommended