Rangasthalam Movie Review రంగస్థలం రివ్యూ

  • 6 years ago
Rangasthalam starring Ram Charan and Samantha Akkineni is this week’s big release in the south. The film directed by Sukumar has earned a positive buzz ahead of its release and the pre-booking in Telugu speaking states is quite encouraging, according to the trade. It is a film set in the 80s and unfolds in a village. The film also stars Aadhi Pinisetty, Jagpathi Babu and Prakash Raj in pivotal roles. This movie released on March 30th.

బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఆ క్రమంలోనే రంగస్థలం విలక్షణమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ చిత్రం తర్వాత రాంచరణ్, నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకొన్నది.
80 దశకం నాటి పరిస్థితులు, కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో సమంత అక్కినేని, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, నరేష్ లాంటి నటుల పాత్రలు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. రంగస్థలం కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. రంగస్థలం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
చెవిటివాడైన చిట్టిబాబు (రాంచరణ్) రంగస్థలం గ్రామవాసి. పొలానికి నీటి సౌకర్యాన్ని అందించే పంపుసెట్ల ఇంజినీర్. చిట్టిబాబుకు కుమార్ అనే అన్నయ (ఆది పినిశెట్టి), తల్లి, తండ్రి (నరేష్), ఓ చెల్లలు ఉంటుంది. చిట్టిబాబు అన్యాయాన్ని అసలే సహించడు. రామలక్ష్మీ (సమంత)తో ప్రేమలో పడుతాడు. గ్రామంలో ప్రెసిడెంట్ (జగపతిబాబు) చేసే అన్యాయాలను ఎదురించడానికి అన్నదమ్ములు సిద్ధమవుతారు. గ్రామాభివృద్ధి కోసం ప్రసిడెంట్‌గా పోటీ చేయాలని కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతాడు. కుమార్‌కు అండగా నవభారత్ పార్టీ ఎమ్మెల్యే (ప్రకాశ్ రాజ్) అండగా నిలుస్తాడు.
ఎన్నికల బరిలోకి దిగిన కుమార్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎన్నికల బరిలోకి దిగిన తన అన్నయ్యకు చిట్టిబాబు ఏ విధంగా తోడ్పాటునందించాడు? ప్రేమించిన రామలక్ష్మీని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎన్నికల్లో కుమార్ గెలిచాడా? ప్రసిడెంట్ పరిస్థితి ఏమైంది? రంగస్థలంలో ప్రసిడెంట్ దురాగతాలను ఎలా చరమగీతం పాడారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగస్థలం సినిమా కథ.
గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఈ కథలో కుటుంబంలో ఉండే విభేదాలు, భావోద్వేగాలు సజీవంగా నిలుపడంలో దర్శకుడు సుకుమార్ సఫలమయ్యాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌తో ప్రారంభమయ్యే రంగస్థలం సినిమా కథలో తొలి భాగంలో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ చక్కగా సాగుతుంది. బలమైన పాత్రలు కథకు ప్రాణంగా నిలిచాయి. తొలిభాగంలో చిట్టిబాబుగా రాంచరణ్, సమంత రామలక్ష్మీ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ అనూహ్యమైన మలుపు రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

Recommended