Karthavyam is a Telugu-language drama film written and directed by Gopi Nainar. It features Nayanthara in the lead role as a district collector, with Ramachandran Durairaj and Sunu Lakshmi in supporting roles. Featuring music composed by Ghibran and cinematography by Om Prakash. This film is set release on March 16, 2018.
ఒకప్పుడు నయనతార అంటే గ్లామర్ హీరోయిన్. దక్షిణాదిలో ఇప్పుడు అందాల తారగానే కాకుండా లేడి హీరోయిన్‌గా పేరుతెచ్చుకొన్నది. ఒకప్పటి లేడి అమితాబ్ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా టైటిల్‌తో నయనతార ఓ ఛాలెంజిగ్ పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఆరమ్ చిత్రం నయనతార కర్తవ్యం చిత్రానికి మాతృక.
కర్తవ్యం కథ ఏమిటంటే..
బుల్లబ్బాయి (రామచంద్రన్), సుమతి (సునులక్ష్మీ) నిరుపేద దంపతులకు కూతురు ధన్సిక కుమారుడు ఉంటారు. కూలీ పనులు చేస్తే గానీ పూట గడవని కుటుంబం. అలా కష్టాల సాగరాన్ని ఈదుతున్న ఈ పేద దంపతులకు ఊహించిన పరిస్థితి ఎదురవుతుంది. తన కూతురు ధన్సిక పంట పొలాల్లో ఆడుకొంటూ బోరుబావిలో పడుతుంది. సుమారు 36 అడుగుల లోతులో పడిన బాలికను రక్షించడానికి కలెక్టర్ మధువర్షిణి (నయనతార) తన యంత్రాంగంతో రంగంలోకి దిగుతుంది.
బోరుబావిలో పడిన బాలికను రక్షించే క్రమంలో నిజాయితీపరురాలైన కలెక్షర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బోరుబావిలో పడిన ధన్సిక పరిస్థితి ఏమైంది? బోరుబావిలో పడిన బాలిక ప్రాణాలతో బయటపడిందా? బోరుబావిలో పడిన ధన్సిక ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే కర్తవ్యం.
దర్శకుడు గోపి నయనార్ కథను మలిచిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. పేదల జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయనే విషయం కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇక కలెక్టర్ పాత్రను మలిచిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. తారల హంగామా లేకుండా కేవలం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటీనటులతో కర్తవ్యాన్ని అమోఘంగా తీర్చిదిద్దారు. సమాజంలో అధికారులు, ప్రభుత్వ వ్యవస్థల తీరుపై సినీ విమర్శనాస్త్రాన్ని అద్భుతంగా సంధించారు.
బీడుబారిన పంటపోలాల్లో బోరుబావి ఉదంతాన్ని హృదయాన్ని అత్తుకునే విధంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ గోపి నయనార్ అని చెప్పవచ్చు. కథను ఇస్రో శాటిలైట్ ప్రయోగానికి లింక్ చేయడం అతని టాలెంట్‌కు గొప్ప నిదర్శనం. సినిమాకు పరిచయం లేని వారి నుంచి నటనను రాబట్టిన విధానం చక్కగా ఉంటుంది.
కర్తవ్యం సినిమాకు ప్రధాన బలం నయనతార నటన. కలెక్టర్ పాత్రలో నయనతార చక్కగా ఒదిగిపోయారు. కీలక సన్నివేశాలలో భావోద్వేగాన్ని అద్భుతంగా పడించారు. తన అధికారాన్ని ప్రదర్శించడానికి నయనతార చూపిన హావభావాలు, ముఖ్యంగా కళ్లతో పలికించిన భావాలు ఆమె ప్రతిభకు అద్దం పట్టాయి

Category
🎥
Short film