• 7 years ago
Chalo introduces a new director Venky Kudumula as the director, Rashmika Mandanna is making her debut as a heroine in the film. The theatrical trailer hiked the expectations on the film and here is the review of the film.

ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. ఈ నాలుగేళ్లలో శౌర్య దాదాపు 10 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే అందులో శౌర్యను స్టార్ హీరోగా నిలబెట్టే సినిమా ఒక్కటీ లేదు. ఈ సారి కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నా సరే ఎలాగైనా తన కెరీర్‌ను ఒక లెవల్‌కి తీసుకెళ్లే హిట్ కొట్టాలనే కసితో సొంత బేనర్లో తన తల్లిదండ్రులే నిర్మాతలుగా 'ఛలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శౌర్య ఈ సినిమాతో అయినా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడా? లేక ఇంకా ఇక్కడే ఉన్నాడా? అనేది రివ్యూలో చూద్దాం.
హరి(నాగ శౌర్య)కు చిన్నప్పటి నుండి కొట్టడం లేదా కొట్టించుకోవడం అలవాటు. అందులోనే అతడికి ఆనందం ఉంటుంది. గొడవల్లో తలదూర్చడం అతడి హాబీ. కొడుకు ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్న తల్లి దండ్రులు.... రజనీకాంత్ సినిమాలోని ఓ సీన్‌కు చూసి ఇన్స్‌స్పైర్ అయి గొడవలు ఎక్కువగా ఉండే ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ‘తిరుప్పురం' అనే ఊరికి పంపిస్తారు. ఆ ఊర్లో తెలుగు-తమిళ వర్గాలు రోజూ గొడవపడుతూ ఉంటారు. ఇక్కడ నిత్యం గొడవలు చూసైనా గొడవలపై విరక్తి చెంది కొడుకు మారుతాడు అనేది వారి ఆశ.
తిరుప్పురం' ఊర్లో అడుగు పెట్టగానే హరి తెలుగువాడని తెలిసి అతడిని చంపాలని ప్రయత్నిస్తారు తమిళ వర్గీయులు. వారి నుండి ఎలాగో తప్పించుకున్న హీరో..... తనకు తెలియకుండానే తమను శత్రువులుగా భావించే తమిళ వర్గానికి చెందిన అమ్మాయి కార్తీక(రష్మిక మండన్న)ను ప్రేమిస్తాడు. మరి తెలుగోళ్లంటే వారిని హీరో ఎలా కన్విన్స్ చేశాడు? ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్న ఆ ఊరి తెలుగు, తమిళ ప్రజలు చంపుకునేంత బద్దశత్రువులు కావడానికి కారణమేంటి? అనేది తెరపై చూడాల్సిందే. నాగ శౌర్య పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే.... హరి పాత్రలో బాగా నటించాడు. లుక్స్ పరంగా కూడా బావున్నాడు. అయితే నాగ శౌర్య నటనలో నెక్ట్స్ లెవల్ మాత్రం కనిపించలేదు. ఎప్పటిలాగే రోటీన్‌గా చూసిన శౌర్యను చూసిన ఫీలింగే కనిపిస్తుంది.

Recommended