• 7 years ago
On the eve of Shakeela movie opening a journalist asked her if RGV gives a chance in GST-2, are you ready to do in that film. Shakeela gave an interesting reply to him.

ఇప్పుడంటే సన్నీ లియోన్, మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్స్ వచ్చారు గానీ.. అప్పట్లో సెక్సీ క్వీన్ అంటే 'షకీలా'నే. ఒకానొక దశలో ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్న పరిస్థితి. తొంభైలలో ఆమె హవా అలా కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్లకు 'శీలవతి' టైటిల్ తో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిజానికి సినిమాలతో విసిగిపోయానని, పెళ్లి చేసుకుని సెటిల్ అవాలనుందని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది షకీలా. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ 'శీలవతి'గా మరోసారి రెచ్చిపోవడానికి సిద్దమైంది.
షకీలా లాంటి బి-గ్రేడ్ సినిమాల స్టార్‌కు 'శీలవతి' అనే టైటిల్ పెట్టడంపై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా ఈ టైటిల్ తో ఒక్కసారిగా అందరి ఎటెన్షన్ తమవైపు తిప్పుకున్నారనే చెప్పాలి.
'శీలవతి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఓ జర్నలిస్టు షకీలాకు చిలిపి ప్రశ్న వేశాడు. సౌత్ ఇండియాలో మీరో పాపులర్ శృంగార తార కదా.. 'జీఎస్‌టీ-2'లో వర్మ మీకు ఛాన్స్ ఇస్తే చేస్తారా? అని ప్రశ్నించాడు. ఇందుకు షకీలా కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.
'వర్మ ఛాన్స్ ఇవ్వడం నా అదృష్టం. వర్మ లాంటి దర్శకుడు అడిగితే వద్దంటానా?.. చేయడానికి నేను రెడీ. ఆయన కెమెరా యాంగిల్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయనలాగా అందాల్ని మరెవరూ చూపించలేరు. కానీ.. ఆయనకేమో సన్నగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం.' అని షకీలా బదులిచ్చింది.

Recommended