• 7 years ago
Rgv announced GST release date on twitter after delaying on Jan 26th. He said US production house is solving all server problems of #GST and grandly releasing it tomorrow 27th morning 9 Am for everyone to watch MiaMalkova.

రాంగోపాల్ వర్మ.. సినిమానే కాదు ఆయన మాట కూడా వివాదమే. మెచ్చేవాళ్లు ఆయన్ను ఆకాశానికెత్తేస్తారు. గిట్టనివాళ్లు రోడ్ల మీద దిష్టిబొమ్మల్ని చేసి తగలబెడుతారు. అభిమానము, ద్వేషమూ.. ఈ రెండూ తనకు పట్టవు. తన పని తనకు నచ్చింది చేయడమే. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. వివాదాల నడుమనే 'జీఎస్‌టీ' విడుదలకు సిద్దమైపోయాడు.
నిజానికి 'జీఎస్‌టీ'(గాడ్,సెక్స్&ట్రూత్) నిన్ననే విడుదల కావాల్సి ఉన్నా.. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సైట్ క్రాష్ అయింది. శుక్రవారం ఉదయం 9గం. సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గాడ్,సెక్స్&ట్రూత్ సైట్ పైనే ఉండటంతో.. ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేక సైట్ ఓపెన్ అవలేదు.
గాడ్,సెక్స్&ట్రూత్ కు ఇంతటి అనూహ్య స్పందన రావడంతో వర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని 'జీఎస్‌టీ' ప్రొడ్యూసర్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను పరిష్కరించి సైట్‌ను అప్‌గ్రేడ్ చేశారని, జనవరి 27వ తేదీ ఉదయం 9గం.కు దీన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. సినిమా వాయిదా పడ్డందుకు చింతిస్తున్నట్లు తెలిపారు.
ట్విట్టర్‌లో మరో కామెంట్ కూడా చేశారు వర్మ. 'జీఎస్‌టీ'కి వస్తున్న ట్రాఫిక్ ను చూసి.. ఇండియాలో చాలామంది దీపికా పదుకొణే కంటే మియా మాల్కోవాను చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, 'సత్యమేవా జయతే'ను కాస్త 'సత్యమియా జయతే'గా మార్చేశాడు. వర్మ చేసిన ఈ కామెంట్‌తో ఇప్పుడు మరో వివాదం మొదలైంది.
పద్మావత్, 'జీఎస్‌టీ' రెండూ ఒకేసారి విడుదల చేస్తుండటంతో.. దీపికాను, మియాను పోల్చి కామెంట్ చేయడంలో తప్పులేదు కానీ.. మధ్యలో 'సత్యమియా జయతే' అంటూ కామెంట్ చేయాల్సిన అవసరమేంటి?.. ఇది కేవలం వర్మ పైత్యం మాత్రమే అంటూ కొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు.

Recommended