The Central Crime Branch of the Coimbatore City police has arrested a kollywood heroine, her parents and brother on the charge of duping an NRI engineer of ₹41 lakh by promising to marry him.
సినిమా అంటే రంగుల ప్రపంచం.. అవకాశాలు ఉన్నంత కాలం ఆ ప్రపంచానికి ఢోకా లేదు. కానీ అవకాశాలు సన్నగిల్లిన నాడు క్రమంగా ఆ ప్రపంచం మసకబారుతుంది. అప్పటిదాకా అనుభవించిన లగ్జరీకి దూరమవడం ఇష్టం లేక.. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారుతారు. ఇలాగే అడ్డదారి తొక్కిన మరో వర్ధమాన నటి కూడా ఇప్పుడు జైలు పాలైన పరిస్థితి..
'ఆడి పొన్ అవణి' అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రుతి(21) అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వర్థమాన నటిగా తమిళ ఇండస్ట్రీలో ఆమె చాలామందికి సుపరిచితమే. కానీ అవకాశాల్లేక కెరీర్ ఢీలా పడ్డ తరుణంలో.. డబ్బు కోసం ఆమె అడ్డదారులు తొక్కింది.
డబ్బు కోసం పలువురు యువకులకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా వలవేసింది. పెళ్లి పేరుతో వాళ్లకు దగ్గరైంది. ఎలాగూ కాబోయే భార్యే కదా.. అని ఆమె అడిగిన ప్రతీసారి వాళ్లు లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. అలా నలుగురైదురు యువకులను శ్రుతి మోసం చేసింది. తీరా అసలు విషయం తెలియడంతో ఆ యువకులు పోలీసులను ఆశ్రయించారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సేలంకు చెందిన వ్యక్తి జి.బాలమరుగన్ వద్ద నుంచి రూ.41లక్షల మేర శ్రుతి కాజేసింది.
హీరోయిన్ శ్రుతి మీద అంతకుముందే మరో కేసు కూడా రిజిస్టర్ అయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పెళ్లి పేరుతో గతంలోనూ ఓ అబ్బాయిని ఇలాగే మోసం చేసిందన్నారు. శ్రుతితో పాటు ఆమె తల్లిగా నటించిన మహిళ(47), తండ్రిగా నటించిన ప్రసన్న వెంకటేష్(37), సోదరుడిగా నిటించిన సుభాష్(19)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Category
🎥
Short film