• 8 years ago
Few models and cine director arrested in Prostitution case in Medchal on Friday.

నగర శివారులో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారమందింది. దీంతో పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు.
కాగా, గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాం హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న యువతులు, యువకులను కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడం గమనార్హం.

Category

🗞
News

Recommended