అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్- చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగోతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ దందాలో పలువురు తెలుగు, కన్నడ హీరోయిన్లు ఇన్వాల్వ్మెంట్ ఉందని, కొందరు డబ్బు కోసం, మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు తెలుస్తోంది. కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.
విక్టిమ్-ఎగా ఉన్న సదరు హీరోయిన్ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. డిసెంబర్ 26, 2017న ఆమెకు మంజూరైన యూఎస్ వీసాపై నిషేధం విధించారని, మార్చిలో ఆమె అమెరికా వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసి షాకైనట్లు సమాచారం. యూఎస్ఏలోకి ఆమెను అనుమతించక పోవడంతో ఆ రోజు ఎయిర్‌పోర్టులో పడుకుని తిరిగి బెంగుళూరు వచ్చిందట.
హైదరాబాద్‌లో ఉన్న సదరు హీరోయిన్‌ను యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆమె తన లాయర్‌తో కలిసి హాజరైనట్లు సమాచారం.
విచారణ సందర్భంగా తనపై బ్యాన్ ఎత్తివేయాలని సదరు హీరోయిన్ అధికారులను వేడుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తమ చేతుల్లో ఉండదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆమె పేరు బయటకు రాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Category
🎥
Short film