Skip to playerSkip to main contentSkip to footer
  • 6/14/2018
కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికీ అవకాశాలు వంటి అంశాలతో టాలీవుడ్ కుదుపు లోనవుతున్న సమయంలో మరో పిడులాంటి వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ నటీమణులు కొందరు అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టించింది. గతంలో కొన్ని చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా వ్వహరించిన ఓ వ్యక్తి ఈ రంకు భాగోతాన్ని అమెరికాలో నడిపిస్తున్నాడు. విచారణలో పలు ఆసక్తికర నిజాలు బయట పడ్డాయి.
గతంలో పలు టాలీవుడ్ చిత్రాలకు కో ప్రొడ్యూసర్ గా పనిచేసిన కిషన్ మోడుగుముడి అనే వ్యకి, అతడి భార్యతో కలసి ఈ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు తేలింది. అంతగా గుర్తింపు పొందని టాలీవుడ్ నటీమణులతో వ్యవహారం సాగిస్తున్నాడు.
అమెరికా వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్ ని టార్గెట్ చేయడం, అక్కడకు వ్యభిచారం కోసం కొందరు నటీమణులని పంపడం జరుగుతోంది. ఓ నటి పోలీస్ లకు పట్టుబడడంతో ఈ విషయం బట్టబయలైంది.
వ్యభిచారం నిర్వహించే నటీమణలు ఒక్కొక్కరి వద్ద నుంచి 3000 డాలర్లు వసూలు చేస్తారట. ఈ మొత్తంలో కిషన్ దంపతులకు వాటా ఉంటుంది. టెంపరరీ వీసాతో వచ్చిన ఓ నటి పక్కన మరో వ్యక్తి ఉండడంఫెడరల్ అధికారులు గమనించారు. ఆయన తన మేనేజర్ అని, ఓ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చినట్లు నటి తెలిపింది.

Recommended