• 7 years ago
Priyamani files complaint in MAA. Angulika movie lands in controversy

వివాహం అనంతరం ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటోంది.ఇటీవల కాలంలో ప్రియమణి తెలుగులో ఎంటువంటి సినిమా చేయలేదు. గతంలో ఈ సెక్సీ హీరోయిన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగేది. ప్రియమణి కెరీర్ లో ఘనవిజయం సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ప్రియమణి సోలో హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాల్లో మెరిసింది. కాగా ప్రియమణి తాజాగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు నమోదు చేసిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి ఎందుకు ఫిర్యాదు చేసిందని అంతా ఆరా తీస్తున్నారు.
ప్రియమణి ఉల్లం అనే తమిళ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎవరి అతగాడు చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది.
ప్రియమణి ని ఇంకా వాడుకుంటున్నారు..
ఆ తరువాత తెలుగులో ప్రియమణి నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రంలో యువత గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ చిత్రంలో చీరకట్టులో కనిపించినా జగపతి బాబుతో చేసిన రొమాన్స్ కు యువత ఫిదా అయ్యారు. ఈ చిత్రం ద్వారా ప్రియమణి పేరు టాలీవడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
దీనితో ప్రియమణికి తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. రాజమౌళి దర్శత్వంలో యమదొంగ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. యమదొంగ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ తో చేసిన హరే రామ్ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో సౌత్ లో ప్రియమణి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రియమణి అప్పట్లోనే నితిన్ చిత్రం ద్రోణలో బికినీ ధరించి సంచలనం సృష్టించింది. ప్రియమణి బోల్డ్ డెసిషన్ కు ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది.
ప్రియమణి సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఐదేళ్ల క్రితం అంగుళిక అనే చిత్రం చేయడానికి సైన్ చేసింది. ఆ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ చిత్రం ప్రస్తుతం వివాదంగా మారింది.

Recommended