The issue of Pawan comments on ABN Channel has become a storm already which RK couldn't hold anymore and he was Filing a Complaint Against Pawan Kalyan.
సినీ హీరో పవన్ కల్యాణ్, అతని అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం తమ ఫిర్యాదులో పేర్కొంది.
మీడియా, మీడియాలోని వ్యక్తుల పట్ల పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచారు. మీడియాపై పవన్ కల్యాణ్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఒక మీడియాను టార్గెట్ చేస్తే మిగిలిన వాళ్లు సైలెంట్‌గా ఉండడం మంచిది కాదని, మిగిలిన మీడియా సంస్థలు జర్నలిస్టులు కూడా కలసి రావాలని కోరారు. అలాగే పవన్ చేస్తున్న దాడి అన్ని మీడియా సంస్థలకూ వర్తించే విధంగా ఉందని, ఈ విషయంపై అందరూ కలిసికట్టుగా పోరాడదామని జర్నలిస్ట్ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
తమ సంస్థ లోగోలు వాడుకుంటూ సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేస్తున్నారని దానికి తమకూ ఎలాంటి సంబంధం లేదని ఎండీ రాధాకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్కే ఏబీఎన్ పేరుతో ట్విటర్ లో తప్పుడు ఖాతా తెరిచి తమకు సంబంధం లేని పోస్టులు వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ట్విటర్ లో ఎబిఎన్ తెలుగు టివి, ఆంధ్రజ్యోతి అని ఆంగ్లాక్షరాలతో అకౌంట్లు తప్ప మరే ఇతర అకౌంట్లు లేవని ఆంధ్రజ్యోతి ప్రకటించింది.
పవన్ తనకు సంబంధించిన ట్వీట్లన్నీ తొలగించి లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్కే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లేనిపక్షంలో తాను తీసుకునే సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ను "ఆంధ్రజ్యోతి-ఏబీఎన్" ఎండీ ఆర్కే తన లీగల్ నోటీసుల ద్వారా పవన్ ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే టివి 9 ఛైర్మన్ పంపిన లీగల్ నోటీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పవన్, ఆర్కే పంపిన నోటీసులు పోస్ట్ చేయకపోవడంతో అవి ఇంకా ఆయనకు అందివుండకపోవచ్చని భావిస్తున్నారు.

Category
🗞
News