• 7 years ago
ఫిట్టింగ్ మాస్టర్' సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి... ఆలస్యం అమృతం, మేం వయసుకు వచ్చాం, చిత్రం చెప్పిన కథ, రామ్ లీలా తదితర చిత్రాల్లో నటించిన ముంబై బ్యూటీ మదాలసా శర్మ జులై7న పెళ్లి చేసుకోబోతోంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ చక్రవర్తిని ఆమె పెళ్లడబోతోంది. మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉండగా మహాక్షయ్ మీద చీటింగ్, రేప్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. అతడితో పాటు తల్లి యోగితా బాలిపై ఓ యువతి కేసు పెట్టింది.
మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, 2015 నుండి తనతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని కంప్లయింట్లో పేర్కొంది. తర్వాత తనకు ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆరోపించింది.
మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని, నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించందని, అందుకే ఆమెపై కూడా కేసు పెట్టినట్లు సదరు యువతి తెలిపింది.
యువతి కేసు పెట్టడంతో మహాక్షయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఐపిసి 90, 375, 114ఎ, 415, 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై మిథున్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందనే విషయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Recommended