• 7 years ago
సెక్స్, వర్జినిటీ లాంటి అంశాల గురించి సినీ సెలబ్రిటీల పలు ఇంటర్వ్యూల్లో బోల్డ్‌గా మాట్లాడటం తరచూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కోవలో మరో హీరోయిన్ చేరింది. 'ఇరుట్టు అరయిల్ మురట్టు కుతు' అనే తమిళ సినిమాలో నటించిన హీరోయిన్ యశిక ఆనంద్ వర్జీనిటీ మీద చేసిన కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఈ బ్యూటీ పబ్లిసిటీ కోసమే బోల్డ్ కామెంట్స్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
‘ఇరుట్టు అరయిల్ మురట్టు కుతు' అనే తమిళ అడల్డ్ కామెడీ చిత్రంలో యశిక నటించింది. అసలు ఈ సినిమా స్టోరీనే విచిత్రంగా ఉంది. వర్జినిటీ కోల్పోవాలనే తన కోరిక పోకుండానే చనిపోయిన ఒక అమ్మాయి దెయ్యంగా మారిన తర్వాత వర్జినిటీ కోల్పోవడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా అసలు కథ.
సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశికకు పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోవడంపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.... ‘చాలా మంది అబ్బాయి పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోతున్నారు. అలాంటపుడు అమ్మాయిలు వర్జీనిటీ కోల్పోతే తప్పేంటి? అంటూ యశిక వ్యాఖ్యానించారు.
వర్జినిటీ అంశంతో ఆగని యశిక.... తన ఫస్ట్ పోర్న్ మూవీ వాచింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా వెల్లడించింది. పోర్న్ సినిమాల గురించి సెర్చ్ చేస్తుండగా ఇంట్లో దొరికిపోయానని వెల్లడించారు. ఇలాంటి అంశాల గురించి యశిక ఇంటర్వ్యూలో ఓపెన్‌గా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది.

Category

🎵
Music

Recommended