• 7 years ago
బైక్‌పై వెళ్తున్న నవదంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అనుకోని ట్విస్ట్ బయటపడింది. ఈ దాడి వెనుక ఉన్నది మృతుని భార్యే అని తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు, వీరఘట్టం మండలం కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతిలకి గత నెల 28న వివాహం జరిగింది. అయితే సరస్వతికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొత్త దంపతులు సోమవారం బైక్ పై వెళ్తుండగా.. తోటపల్లి వద్ద వీరిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడిలో గౌరీశంకరావు అక్కడికక్కడే మృతిచెందగా.. భార్య సరస్వతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దాడి వెనుక ఉన్నది సరస్వతి అని తేలడం సంచలనం రేపుతోంది.
ఇష్టం లేని పెళ్లి చేశారన్న కోపంతో.. తన మిత్రుడు శివ, , విశాఖ రౌడీషీటర్‌ గోపిలతో భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా.. సరస్వతి సూచన మేరకే తాము హత్య చేశామని చెప్పినట్టు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended