వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిని ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆమె రూరల్ జిల్లాకు కూడా ఇంఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాహ విషయంపై ఆమ్రపాలి ఇప్పటికే ధ్రువీకరించారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి.. సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.
అయితే విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమ్రపాలి... ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు. వివాహం నేపథ్యంలో జనవరి 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు తెలిసింది. ఇక ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

Category
🗞
News