• 7 years ago
nitya menen played different role in latest movie Awe!

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో విలక్షణమైన నటనతో దక్షిణాది నటి ఎవరంటే నిత్యమీనన్ అని ఠక్కున చెబుతారు.నిత్యామీనన్ కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే కనిపిస్తారు.తాజాగా అ! అనే చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా కనిపించింది.నిత్యమీనన్ మాట్లాడ్తూ" అ! చిత్రం కథ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సాధారణంగా చాలా కథలు వింటాం. కానీ ఇలాంటి స్టోరి వినడం చాలా రేర్.

అ! చిత్రంలోని క్రిష్ లాంటి పాత్రను దర్శకుడు చాలా కొత్తగా మలిచాడు. అదే విషయం నన్ను చాలా ఆకట్టుకొన్నది.ప్రశాంత్ రెండోసారి కలిసినప్పుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ప్రశాంత్ చెప్పారు. ముందుగా రాధ క్యారెక్టర్, ఆ తర్వాత క్రిష్ పాత్ర గురించి చెప్పారు. అయితే నేనే క్రిష్ పాత్రను ఎంచుకొన్నాను. లెస్బియన్) పాత్రలో కనిపించడం కెరీర్‌ కు ఇబ్బంది అనిపించలేదు. క్రిష్ పాత్రను చేసేటప్పుడు నేను ఆలోచించలేదు. ప్రస్తుతం ఆలోచించడం లేదు. నటిగా అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోలేదు. నటిగా నాకు ఛాలెంజ్ ఉన్న పాత్ర అనిపించింది.. అందుకే చేశాను"అని ఆవిడా అన్నారు.
స్క్రిప్టు నచ్చితేనే సినిమాలు చేస్తానని...తనకి ఏదో ఒక పాయింట్ నచ్చాలి. అప్పుడే నేను సినిమాకు ఓకే చెబుతాను. నచ్చకపోతే నేను అప్పుడే నో చెబుతాను అని ఆవిడా అన్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రాజెక్ట్ ప్రాణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రచనా సహకారం అందించారు . ఆ చిత్రం కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్నారట.

Recommended