• 7 years ago
Gnanavel Raja's wife makes controversial statements on heroines. heroines playing cheap tricks syaing Neha

సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎప్పుడూ ఉండేవే. కానీ కొన్ని వివాదాలు అగ్గిమీద గుగ్గిలంగా మారుతుంటాయి. అవకాశాల పేరుతో హీరోయిన్లని నిర్మాతలు వాడుకుంటుంటారు అనే అపవాదు సినీ ఇండస్ట్రీపై ఉంది. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లని ఉద్దేశించి తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జ్ఞానవేల్ రాజా తమిళంలో ప్రముఖ నిర్మతగా కొనసాగుతున్నారు. సూర్యతో ఆయన సింగం 3, గ్యాంగ్ వంటి చిత్రాలని నిర్మించారు. సింగం 3 చిత్రం నిరాశ పరచగా గ్యాంగ్ పరవాలేదనిపించింది.
హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను అందరు హీరోయిన్లని ఉద్దేశించి చెప్పడం లేదని తన చుట్టూ జరిగిన సంఘటనలని పరిశీలించిన తరువాత ఈ వ్యాఖ్యలు చేస్తున్నాన్నాయి అన్నారు.
కొందరు హీరోయిన్లకు ఇండస్ట్రీ లోని పెళ్లైన మగవారే టార్గెట్ అని అన్నారు. ఫోన్ చేయడం.. బెడ్ రెడీగా ఉందని పిలిపించుకోవడం ఇదే పనిగా మారిందని తీవ్రమైన పదజాలం వాడారు.
ఆడవారికి ఆడవారే శత్రువు అంటే ఇదేనేమో అని నేహా అన్నారు. పెళ్ళైన మగవారిని హీరోయిన్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి భార్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. నేహా చేసిన ఈ వ్యాఖ్యల్లో తన భర్త జ్ఞానవేల్ ని హీరోయిన్లు బుట్టలో వేసుకుంటున్నారని అనుమానాలు తలెత్తాయి. ఈ వ్యవహారం మొత్తంలో తన భర్తకు సంబంధం లేదని నేహా క్లారిటీ ఇచ్చింది. నేహా ఘాటు వ్యాఖ్యలు ఎవరిపై అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.

Recommended