సూపర్ హీరోయిన్ కు వేదింపులు

  • 6 years ago
నాగార్జున హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' మూవీ గుర్తుందా? అ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆయేషా టకియా తన అంద చందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. చాలా రోజుల తర్వాత ఆయేషా టకియా పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తన భార్యను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, చంపుతామని బెదిరించారని ఆయేషా భర్త పర్హాన్ అజ్మి ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో పాటు తల్లి, చెల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ముంబై పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వరుస ట్వీట్లు చేశాడు.
ఈ విషయం గురించి ముంబై 9వ జోన్ డిసిపి దహియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అతడికి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ లేదని ట్వీట్ చేశారు. తమకు సహాయం చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సుష్మా స్వరాజ్‌లను 'బేటీ బచావో' అంటూ పర్హాన్ వేడుకోవడం మీడియాలో చర్చనీయాంశం అయింది.
డిసిపి దహియాకు ఫోన్ ద్వారా సందేశం పంపినా పట్టించుకోవడం లేదని వెల్లడిస్తూ.... అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పర్హాన్ అజ్మి ట్విట్టర్లో పోస్టు చేశాడు.

Recommended