• 7 years ago
The 'Suchi Leaks' controversy, as it is being called, has created a stir in Kollywood.After months gap again she is back now.

సుచీ లీక్స్.. గతేడాది తమిళ నటీనటుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పేరు ఇది. కొన్ని నెలలుగా సుచీ తెరపై లేకపోవడంతో ఆ నటీనటులంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ 'ఐయామ్ బ్యాక్' అంటూ సుచీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇప్పుడు వాళ్ల గుండెలు అదిరిపడేలా చేస్తోంది. సుచీ మళ్లీ ఏం లీక్ చేసి ఎవరి కొంప ముంచుతుందోనన్న టెన్షన్ వారిని వెంటాడుతోంది.. ఇంతకీ సుచీ ఏమందంటే..
'ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురు నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి' అని పేర్కొంటూ మరోసారి సుచిత్ర బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సుచిత్ర తాజా ట్వీట్ కోలీవుడ్ స్టార్స్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. సుచిత్ర చేతిలో ఎవరు బలికాబోతున్నారు? అన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. హీరో-హీరోయిన్ల ఎఫైర్స్ వీడియోలను సుచీ లీక్ చేస్తానని చెప్పడం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేదిగా మారింది.
గతేడాది సుచీ లీక్స్ బయటకొచ్చిన సందర్భంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న ప్రచారం కూడా జరిగింది. నిజంగా సుచిత్రకు అసలేమైంది?.. ఆమె ఎందుకలా చేస్తుంది? అన్న దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కోలీవుడ్ లోనూ ఎవరూ దీనిపై ఆరా తీసినట్లుగా లేరు.
కేవలం హీరో ధనుష్‌తో తలెత్తిన గొడవల కారణంగానే సుచిత్ర.. ఈ 'లీక్స్'తో బ్లాక్ మెయిల్ చేస్తోందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే సుచిత్రకు వాళ్ల నుంచి తీరని అన్యాయం ఏమైనా జరిగిందా?.. అందుకనే వారిపై ఇంతలా కక్ష కట్టిందా? అని అనుమానం వెలిబుచ్చుతున్నవారు కూడా లేకపోలేదు.
తన భార్య మానసిక పరిస్థితి బాగా లేకనే ఇలా చేస్తోందని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని అప్పట్లో సుచిత్ర భర్త తెలిపారు. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ ఖాతా కూడా క్లోజ్ అయిపోయింది. దీంతో ఈ వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు 'నేను మళ్లీ వచ్చేశాను..' అని సుచిత్ర బాంబు పేల్చడంతో కోలీవుడ్ స్టార్స్‌కు మళ్లీ భయం పట్టుకుందట. ఇంతకీ సుచిత్ర ఈసారి ఎవరిని టార్గెట్ చేయబోతుందో మరి?..

Recommended