Skip to playerSkip to main contentSkip to footer
  • 4/2/2018
TV anchor Radhika Passed. She jumps from building

ప్రముఖ యాంకర్ రాధిక (30) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రముఖ ఛానల్ లో ఆమె యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాధికా ఎప్పటిలాగే విధులు పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకుంది. కొద్ది సమయానికే ఆమె భవనం పైకి వేగంగా ఎక్కుతుండడంతో ఇరుగుపొరుగువారు సందేహించారు. స్పందించేలోపే ఘోరం జరిగిపోయింది. ఐదంతస్తుల భవనం నుంచి దూకి రాధిక మరణించింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
రాధిక తన తండ్రి, చెల్లెలితో కలసి మూసాపేట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. రాధిక ఆత్మహత్య చేసుకుకోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా అంటూ రాధిక సూసైడ్ నోట్ లో పేర్కొనట్లు తెలుస్తోంది.
రాధిక కొన్ని నెలల క్రితం తన భర్త నుంచి విడిపోయినట్లు తెలుస్తోంది. రాధిక పదిహేను ఏళ్ల క్రితం అనిల్ కుమార్ తో వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తన భర్త నుంచి విడిపోయినప్పటి నుంచి రాధిక మానసిక వేదన అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
తన కుమారుడి పరిస్థితి కూడా రాధికని మరింతగా మానసిక వేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది. రాధిక కుమారుడు మానసిక వైకల్యంతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతన్నారు. ఈ కారణాలే ఆమె బలవన్మరణానికి దారి తీసి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Recommended