• 7 years ago
Sri Reddy Mallidi is news presenter and actor in Television Industry. Later She became actress. Recently, in an interview to a leading channel she made sensational comments on Jana Sena Party President Pawan Kalyan.

న్యూస్ యాంకర్, నటి శ్రీరెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు సంచలనం రేపుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని సంధించిన మాటలు మీడియా వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగు అమ్మాయిలను పట్టించుకోవడం లేదు. తెలుగు సాంకేతిక నిపుణులకు సినీ వర్గాల నుంచి ఆదరణ లభించడం లేదని ఆమె అన్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శనాస్త్రాలను సంధించారు. ఆమె ఏమన్నారంటే..
ఇంటర్యూలో భాగంగా శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గారు.. మీరు తెలుగు గురించి బోలెడన్నీ ఉపన్యాసాలు ఇస్తారు. తెలుగు పుస్తకాలు చదువుతాను అని చెబుతారు. మీరు సహాయం చేస్తానని చెప్పుకొంటారు. మీరు ఎందుకు తెలుగు హీరోయిన్లను సినిమాల్లోకి తీసుకోరు అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.
మీకు తెలుగు మీద అంత ప్రేమ ఉంటే.. నలుగురు తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని అనిపించదా. మీకు తెలుగు మీద నిజంగా మనసుంటే.. తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వండి. విలన్లను తెలుగు వారిని ప్రోత్సాహించండి. సాంకేతిక నిపుణులకు అవకాశం ఇవ్వండి అని ఆమె అన్నారు.
ఒకవేళ మీరు తెలుగు కళాకారులకు అవకాశం ఇస్తే మీకు తెలుగు మీద ప్రేమ ఉందని నమ్ముతాం. మీరు రాజకీయవేత్తగా ఎదుగాలని కోరుకొంటున్నాను. మిమ్మల్ని ప్రశ్నించినందుకు కత్తి మహేష్ మీద దాడి చేసిన విధంగా మీ ఫ్యాన్స్ నాపై దాడి చేసినా గానీ నేను భయపడను అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.
మీ సినిమాల్లో నటించడానికి సమంతనే కావాలా.. అందరికీ ఇలియానానే కావాలా? తమన్నానే కావాలా? ఇప్పుడు చాలా మంది వారికి ధీటుగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఎందుకు రావని నేను ఉద్యమం చేపడుతా. చాలా మంది తెలుగు అమ్మాయిల కోసం పోరాటం చేస్తాను. మీరు కూడా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నారు. మీరు నిజంగా తెలుగువారిపై ప్రేమ ఉంటే స్థానికులకు అవకాశాలు ఇవ్వండి అని శ్రీరెడ్డి కోరింది.

Recommended