Actor Kathi Kantha Rao son Raja Rao comments on Vanisri. He explained the financial situation of his family.
ఒకప్పుడు తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత జానపద చిత్రాల్లో ఎనలేని కీర్తి సంపాదించారు. తాను హీరోగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో బాగా సంపాదించిన కాంతారావు.... చివరకు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. తమ కుటుంబం ఇలా కావడానికి గల కారణాలను కాంతారావు కుమారుడు రాజా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒకప్పుడు తమ కుటుంబం రాజుల్లా బ్రతికింది. తమకు మద్రాసులో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేదని, కార్లో తిరగడం తప్ప బస్సు ఎక్కడం తెలియదని, అయితే తమ ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఇపుడు ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవమే అని కాంతారావు తనయుడు రాజా వెల్లడించారు. ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలోనే వెళ్లాలి, సొంత వెహికిల్ కూడా లేదని రాజా తెలిపారు.
రామారావుగారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించారు. కానీ కాంతారావుగారు ఇండస్ట్రీకి వచ్చే సమయానికే చాలా రిచ్. చాలా పొలాలు, భూములు ఉండేవి. ఆయనకు నాటకాల పిచ్చి ఉండేది. ఆ పిచ్చితోనే సినిమాల్లోకి వచ్చారు.... అని రాజా తెలిపారు.
నాన్నగారు నటుడిగా కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆయన సినిమా నిర్మాణంలోకి రావడంతో మొత్తం లాస్ అయింది. ఐదు చిత్రాల నిర్మాణంతో తమ ఆస్తులన్నీ కరిగిపోయాయి అని రాజా తెలిపారు.సినిమా నిర్మాణంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు. చివరకు అప్పులు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో 80 ఎకరాల భూమిని నాన్నగారు అమ్మేశారు అని... రాజా తెలిపారు.
అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్‌కు మారిపోయింది. మద్రాసులో అవకాశాలు లేవు. ఆస్తులు కూడా పోయాయి. చివరకు ఇల్లు అమ్ముకుని ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని కుటుంబాన్ని నెట్టుకొద్దామనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చేశాం. ఆ సమయంలో వాణిశ్రీ గారు ఇచ్చిన సలహా ఫాలో కావడంతో మరింత చితికిపోయాం... అని రాజా తెలిపారు.

Category
🎥
Short film