• 8 years ago
Jabardasth fame Comedian Chammak Chandra New House Warming Function, Raccha Ravi posted a photo from the Function.

జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఓ కుటుంబంలా ఉంటారన్న విషయం తెలిసిందే. వీరంతా ఒక్కొక్కరుగా సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. సుధీర్, శ్రీను తదితరులు ఇటీవల సొంతింట్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర వంతు. కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయాడు చంద్ర.
ఒకవైపు ఆడవాళ్ళను తక్కువ చేస్తూనే, మరో పక్క వాళ్ళ విలువ ఏంటో చెబుతూ అందరి అభిమానాన్ని పొందుతున్నాడు .జబర్దస్త్ షో తో మంచి పాపులారిటి సంబంధించిన వాళ్ళలో ఒకడు చమ్మక్ చంద్ర. ఫ్యామిలి స్కిట్ తో కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే అందరు ఇష్ట పడతారు.
జబర్దస్త్‌తో చంద్రకు మంచి నేమ్.. ఫేమ్ ఇచ్చింది. ఇవాళ చంద్ర నూతన గృహ ప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమం అంతా సింపుల్‌గా జరిగిపోయినట్టుంది. పెద్దగా ఆర్భాటంగానీ, సెలబ్రిటీల సందడీ, హడావిడీ లేకుండా సింపుల్‌గా గృహప్రవేశం చేసాడు చంద్ర. ఈ విషయం కూడా రచ్చరవి పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ తో అందరికీ తెలిసింది.
ఒక్క రచ్చ రవి మాత్రం కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది.
చంద్ర గృహ ప్రవేశం అంటూ రవి ఓ ఫోటోను షేర్ చేశాడు. "ఆనందమానందమాయనే మా చంద్రన్న ఒక ఇంటి వాడు ఆయనే..." అంటూ రవి కామెంట్ పెట్టి చంద్ర గృహ ప్రవేశం సందర్భంగా దిగిన ఫోటోకు టాగ్ చేశారు. ఇక అక్కడ కామెంట్ల రూపంలో చంద్రకి అభినందనలు తెలుపుతున్నారు చంద్ర ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు.

Recommended