Skip to playerSkip to main contentSkip to footer
  • 11/17/2017
Namitha, the sexy siren of South Cinema has been trying hard to survive the competition after her debut in Telugu. She migrated to Tamil Cinema and acquired great success and fan following there.

సీనియర్‌ నటుడు శరత్‌బాబుతోనట.! ఈ గాసిప్‌ కొన్నాళ్ళ క్రితం గట్టిగా విన్పించింది. అయితే, అది గాలి వార్త మాత్రమేనని నమిత కొట్టి పారేసింది. 'ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకొన్నాళ్ళు ఇలాగే లైఫ్‌ని సోలోగా ఎంజాయ్‌ చెయ్యాలనుకుంటున్నాను.. ఇప్పటికైతే నాకెలాంటి ప్రేమ వ్యవహారాలూ లేవు..' అని అప్పట్లో క్లారిటీ ఇచ్చిన నమిత, అందరికీ షాకిస్తూ, పెళ్ళి కబురు చెప్పేసింది.
వీరేంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నట్లు రీసెంట్ గానే ప్రకటించింది నమిత. తన మ్యారేజ్ విషయాన్ని సడెన్ గా అధికారికంగా వెల్లడించి అందరికీ నమిత షాక్ ఇవ్వగా.. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన అనేక సంగతులు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నమిత తన వెడ్డింగ్ కార్డును అందరికీ చూపించేసింది కూడా.
తిరుపతిలోని ఓ హోటల్ లో ఈ నెల 22న సాయంత్రం 7.30 గంటలకు మల్లిరెడ్డి వీరేంద్ర చౌదరి- నమిత, ముకేష్ కుమార్ వంకావల జంటకు.. సంగీత్ ఏర్పాటు చేసినట్లు ఓ పేజ్ ను ప్రింట్ చేయగా.. మరో పేజ్ లో నవంబర్ 24 న ఉదయం 5.30 గంటలకు ఇస్కాన్ టెంపుల్ లో పెళ్లి ముహూర్తంగా నిర్ణయించినట్లు మరో పేజ్ లో ప్రకటించారు.
అటు సంగీత్.. ఇటు పెళ్లి రెండూ తిరుపతిలోనే కావడం విశేషం. సొంతం అంటూ కెరీర్ ను ప్రారంభించిన నమిత.. ఈ నెల 24న తిరుపతిలో వీరేంద్ర చౌదరికి సొంతం అవుతోందన్న మాట. సింపుల్ గా ఉన్నా.. ఒకే వెడ్డింగ్ కార్డ్ లో రెండు ఈవెంట్స్ కు సంబంధించిన ఇన్విటేషన్ ను అందించేశారు ఈ జంట.

Recommended