• 7 years ago
Julie 2, starring Raai Laxmi, has been in the news for some time now and is in theatres but Turns a Disaster.

దక్షిణాదిలో అంతో ఇంతో పేరు తెచ్చుకున్నా టాప్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది పేరు తెచ్చుకొన్న లక్ష్మీరాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. జూలీ2 చిత్రంలో తన అందానికి మెరుగుపెట్టుకొని హాట్‌హాట్‌గా నటించింది. అనేక వివాదాలు, సంచలన వార్తల మధ్య నలిగిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజైంది. విడుదలకు ముందు వచ్చిన మంచి స్పందన భిన్నంగా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తాపడింది. బాలీవుడ్‌లో పాగా వేయాలనుకొన్న రాయ్ లక్ష్మీ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది. ఆ విషయం లో బాగానే హర్ట్ అయినట్టుంది ఇంకా ఆ సినిమా గురించే కలవరిస్తోంది... లేటెస్ట్ ఇంటర్వ్యూలో లక్ష్మీ రాయ్ చెప్పిన సంగతులు...
దక్షిణాదిన నా సినిమాలు చూసి నాకు "జూలీ 2"లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు కొత్త ఫేస్‌ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు అనుకున్నారట! అవకాశం రాగానే సంతోషం అనిపించినా, వెంటనే ఓకే చెప్పలేకపోయాను. దాదాపు నెల రోజులపాటు ఆలోచించాను. ఈ సినిమా కోసం మునుపెన్నడూ పడనంత కష్టం పడ్డాను.

Recommended