• 7 years ago
Director Krish tied the knot with Ramya Velaga in 2016. And in two years of marriage, the couple has chosen to call it quits.

ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆయన భార్య రమ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారనే వార్త సినీ వర్గాల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏడాది కాకముందే దంపతులు విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణమనే మాట వినిపిస్తున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతున్నది. సినీవర్గాల ప్రకారం..
సదరు దర్శకుడు రూపొందించిన ఓ చారిత్రాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు, నటుడు కలయికలో వచ్చిన భక్తి, ఆధ్యాత్మిక చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించారు.
మంచి ప్రతిభతో పలు చిత్రాల్లో నటించినా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఆ దర్శకుడు తన పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు సమాచారం. గత రెండేళ్లుగా వారిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు సమాచారం.
భర్తపై అనుమానం రావడంతో ముంబైకి వెళ్లి ఆరా తీశారట. దాంతో భర్త అఫైర్ గురించి పలు విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురయ్యారట. ఇక చేసేదేమీలేక విడాకులు తీసుకోవడమనే మంచిదని నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొన్నది.
కొద్దివారాలుగా దర్శకుడి విడాకుల వ్యవహారం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దర్శకుడి వైవాహిక జీవితం వైఫల్యం చెందిన వార్త బయటకు పొక్కకుండా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కుటుంబాలు జాగ్రత్తలు తీసుకొన్నాయట. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

Recommended