• 8 years ago
The much-hyped bold film 'Julie 2' failed to pull the audience to the movie theatres. The film marks the Bollywood debut of popular south actress Raai Laxmi who has been raising the temperatures ever since the release of the film's trailer.

దక్షిణాదిలో అగ్రతారగా పేరు తెచ్చుకొన్న లక్ష్మీరాయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. జూలీ2 చిత్రంలో తన అందానికి మెరుగుపెట్టుకొని హాట్‌హాట్‌గా నటించింది. అనేక వివాదాలు, సంచలన వార్తల మధ్య నలిగిన ఈ చిత్రం ఈ నెల 24న రిలీజైంది. విడుదలకు ముందు వచ్చిన మంచి స్పందన భిన్నంగా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తాపడింది. బాలీవుడ్‌లో పాగా వేయాలనుకొన్న రాయ్ లక్ష్మీ ఆశలపై ఈ చిత్రం నీళ్లు చల్లింది.
రాయ్ లక్ష్మీ నటించిన జూలీ2 చిత్రం 80వ దశకంలో ఓ సినీతార జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు తెరక్కించామని చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ చెప్పారు. ఆ సినీతార ఎవరు అనే ఆరా తీస్తే అన్ని వేళ్లు నగ్మా వైపు చూపించాయి. నగ్మా జీవిత కథ అనగానే జూలీ2పై అంచనాలు పెరిగాయి. ప్రచారపరంగా ఈ సినిమా మరోస్థాయికి వెళ్లింది.
ఇలాంటి వార్తల నేపథ్యంలో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూలీ2 చిత్రం తొలి ఆట నుంచే తుస్సుమన్నది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీ చాలా దారుణంగా కనిపించింది. తీరా సినిమా చూస్తే మర్డర్ మిస్టరీ అని తేలిపోయింది. ఏ సినీ తారకు సంబంధం లేని కథను తెరకెక్కించారనే మాటలు వినిపించాయి.
సినీతారల బయోపిక్‌లో ఉండే మసాలా జూలీ2లో కరువైంది. అందుకే సినిమా ప్రజాదరణకు నోచుకోలేకపోయింది.

Recommended