• 6 years ago
Going by the visuals, Jayam Ravi and his team are sent to space to stop a 200 kiloton missile from reaching Earth. Tipped to be a race-against-time thriller, the film also stars Nivetha Pethuraj and Singaporean actor Aziz Aaron.
#JayamRavi
#NivethaPethuraj

తమిళనాట నిన్నట్నుంచి ఒక సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా పేరు.. "టిక్ టిక్ టిక్". జయం రవి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. హాలీవుడ్ వచ్చే సైన్స్ ఫిక్షన్.. స్పేస్ సినిమాలు చూసి ఆస్వాదిస్తూ.. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావా అంటూ నిట్టూర్చడం మామూలే. మన దర్శకులకు కూడా అలాంటి భారీ ఆలోచనలు ఉన్నప్పటికీ.. ఇలాంటివి మన దగ్గర సాధ్యమా అన్న సందేహాలతో మొగ్గ దశలోనే ఆ ఆలోచనల్ని తుంచేసేవాళ్లు. కానీ 'బాహుబలి' లాంటి సాహసోపేత ప్రయత్నాల్ని చూశాక మిగతా దర్శకులకూ ధైర్యం వస్తోంది.
మన వాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తమిళంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ స్పేస్ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఇండియాలో రాబోతున్న తొలి స్పేస్ మూవీగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటి అంటే.. ఇండియాలో తెరకెక్కిన తొలి పూర్తి స్థాయి స్పేస్ మూవీ ఇదేనట.
ఇంతకుముందు అంతరిక్షం నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో స్పేస్ గురించి ఊరికే అలా టచ్ చేశారు అంతే. పూర్తి స్థాయి స్పేస్ మూవీ అన్నది ఇండియాలో ఇప్పటిదాకా రాలేదు. హాలీవుడ్ నుంచి మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. వాటిని చూసి మన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.
ఐతే శక్తి సౌందర్ రాజన్ అనే దర్శకుడు తమిళంలో ఫుల్ లెంగ్త్ స్పేస్ మూవీ తీసేశాడు. ఈ సినిమా ట్రైలరే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది."తనీ ఒరువన్"తో దేశవ్యాప్తంగా పాపులరైన జయం రవి నటిస్తున్న ఈ సినిమా పేరు.. ‘టిక్ టిక్ టిక్'. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Recommended