• 7 years ago
Mahanati movie twitter review. Unanimous blackbuster talk from all over
#Mahanati
#savitri
#ntr
#keerthysuresh


తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటి సావిత్రి. దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్ హోదా దక్కించుకొన్న మహానటి. అలాంటి మహోన్నతమైన నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకొన్న అతికొద్ది మంది హీరోయిన్లలో సావిత్రి ఒకరు. అలాంటి నటి జీవిత కథ ఆధారంగా మహానటి పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఎన్నో అద్భుత సక్సెస్‌లను సొంతం చేసుకొన్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ రూపొందించిన ఈ చిత్రం ఆ బ్యానర్‌కు మరో ఘనవిజయాన్ని అందించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
విజయవాడలో అతి సామాన్య జీవితంలో పుట్టిన సావిత్రి (కీర్తి సురేష్) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకొంటుంది. పెదనాన్న కేవీ చౌదరీ (రాజేంద్రప్రసాద్) అండతో పెరిగి పెద్దవుతుంది. తన పెదనాన్న ప్రోత్సాహంతో తొలుత నాటక రంగం, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఎంతగానో అభిమానించే హీరో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించే స్థాయికి హీరోయిన్‌గా ఎదుగుతుంది.సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో తనకు గాడ్ ఫాదర్‌గా మారిన జెమినీ గణేషన్‌ (దుల్కర్ సల్మాన్) దగ్గరవుతుంది. అప్పటికే వివాహితుడైన జెమిని ప్రేమలో పడటమే కాకుండా అతడిని సావిత్రి వివాహం కూడా చేసుకొంటుంది.
పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులను సావిత్రి ఎదుర్కొన్నారు? భర్త జెమినీ గణేషన్‌తో విబేధాలు ఎందుకు వచ్చాయి? భర్తకు దూరమైన తర్వాత సావిత్రి వ్యక్తిగత, సినీ జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏంటీ? కోమాలోకి వెళ్లిన తర్వాత ఆమె జీవితం గురించి ఎలా పరిశోధన చేశారు? చివరకు సావిత్రి జీవితం ఎలా ముగిసింది? మహానటి కథలో విజయ్ ఆంటోని (విజయ్ దేవరకొండ), మధురవాణి (సమంత) పాత్రల ప్రాధాన్యం ఏమిటనే విషయాలకు తెరమీద సమాధానమే మహానటి చిత్ర కథ.

Recommended