Kirrak Party is a Telugu language campus romantic comedy film directed by Sharan Koppisetty and produced by Ramabrahmam Sunkara under AK Entertainments banner.
హ్యాపీడేస్ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్‌లో సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. స్వామి రారా సినిమాతో ప్రారంభమైన విజయాల వేట కేశవ వరకు సాగింది. తాజాగా కన్నడంలో విజయవంతమైన కిరిక్ పార్టీ సినిమా రీమేక్‌గా మలిచి కిరాక్ పార్టీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా కాలేజీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ) ఇంజినీరింగ్ స్టూడెంట్. ఐదుగురు ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ కాలేజీలో హంగామా చేస్తుంటాడు. అలాంటి కృష్ణ తన సీనియర్ మీరాతో ప్రేమలో పడుతాడు. కానీ ఓ కారణంగా మీరా అతడికి దూరమవుతుంది. దాంతో సరదాలకు దూరమైన కృష్ణ వైరాగ్యానికి లోనవుతాడు. ఆ తర్వాత కాలేజీలో జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను చూసి ప్రేమలో పడుతుంది. కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత ఏమి జరిగిందనేది కిరాక్ పార్టీ సినిమా కథ.
తాను అమితంగా ప్రేమించిన మీరాకు కృష్ణ ఎందుకు దూరమయ్యాడు? ఏ పరిస్థితుల్లో మీరాను కోల్పోయాడు? సరదాగా ఉంటే కృష్ణ ఒక్కసారిగా వైరాగ్యానికి లోనవ్వడానికి కారణం? కృష్ణ జీవితంలోకి సత్య ప్రవేశించిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు తెరపైన సమాధానం కోసం కిరాక్ పార్టీ చూడాల్సిందే..
కిరాక్ పార్టీ తొలిభాగంలో కాలేజీ వాతావరణం, సీనియర్లు, జూనియర్లకు మధ్య ర్యాగింగ్, గొడవలు, కొట్లాటలతో సాగిపోతుంది. ఆ తర్వాత మీరాకు కృష్ణ దగ్గరవ్వడంతో కథ రొమాంటిక్‌గా మారుతుంది. కృష్ణ జీవితం సాఫీగా సాగుతుందనుకొంటున్న సమయంలో ఒక్క కుదుపు కుదిపేస్తుంది. ఎవరూ ఊహించిన ఓ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
ఇంటర్వెల్ తర్వాత కాలేజీలో కృష్ణ గంభీరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. సరదాలకు దూరమై కాలేజీ గ్యాంగ్ వార్ మధ్య కాలం వెల్లదీయడం లాంటి జరుగుతుంటాయి. ఈ మధ్యలో సత్య అతడి జీవితంలోకి ప్రవేశించడంతో మళ్లీ కథనం కొంత పుంజుకొన్నట్టు కనిపిస్తుంది. మీరా దూరమైన కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిన కృష్ణ వాస్తవ జీవితంలోకి రావడంతో కథకు ముగింపు పడుతుంది.
ఆసక్తికరంగా సన్నివేశాలను రూపొందించడంలో విఫలమైనట్టు కొట్టొచ్చి కనబడుతాయి. కథ, కథనాలు, సన్నివేశాల రూపకల్పనలో రొటీన్ వ్యవహారమే ప్రేక్షకుడికి ఎదురవుతుంది. ఓవరాల్‌గా హ్యాపీడేస్, ప్రేమమ్ లాంటి సినిమాలకు మించి ఆశించిన ప్రేక్షకులకు కొంత నిరాశనే కలిగించాడని చెప్పవచ్చు.

Category
🎥
Short film