• 7 years ago
మన పక్కదేశం శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి, తమిళ టైగర్లకు జరిగిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ బ్రతకలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భారత దేశం వైపు సముద్ర మార్గంలో వలస బాటపట్టిన శరణార్థులు ఎందరో. అలా బయల్దేరిన వారిలో సముద్రంలోనే సమాధి అయిన వారే ఎక్కువ.
శరణార్థులుగా భారత దేశం చేరిన కొద్ది మంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనే కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా 'ఒక్కడు మిగిలాడు' చిత్రం తెరకెక్కించారు. మంచు మనోజ్ కెరీర్లోనే ఒక విభిన్నమైన చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.... పీటర్(శ్రీలంకలో తమిళ టైగర్ల నాయకుడు), సూర్య (ఇండియాలో యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్)గా మనోజ్ ద్విపాత్రాభినయం చేశాడు.
ఇండియాలో జరిగే కథ నేపథ్యానికి వస్తే.....సూర్య (మంచు మనోజ్) పసి బిడ్డగా ఉన్నపుడే శ్రీలంక నుండి భారత దేశం వలస వస్తాడు. అందరినీ పోగొట్టుకున్న అతడిని తోటి శరణార్థులు చేరదీసి పెంచుతారు. స్థానిక యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన సూర్య.... ఇక్కడ శరణార్థుల పట్ల కొందరు రాజకీయ నాయకులు, స్వార్థపరులు చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తాడు. శ్రీలంకలో ఇది మీ దేశం కాదు మీరు శరణార్థులు అంటున్నారు. భారత దేశం వస్తే ఇది మీ దేశం కాదు శరణార్థులు అంటున్నారు. మాకు దేశం అంటూ లేదా? మాకు ఎక్కడా స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా? అని పోరాడే పాత్ర సూర్య పాత్ర.

Okkadu Migiladu movie review. Ajay Andrews Nuthaki directed this high-octane action drama. Okkadu Migiladu is produced by SN Reddy and Laxmikanth N on Padmaja films India Private Limited.

Recommended