• 8 years ago
Here's the React latest 2017 Telugu short film by Krishna Anil. Produced by Actor Ravi Teja.

హీరో రవితేజ తాజాగా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ప్రతి అమ్మాయి ఒకరి చెల్లెలు లేదా కూతురే.... అంటూ రవితేజ ఈ షార్ట్ ఫిల్మ్ షేర్ చేశారు. దీన్ని నిర్మించింది కూడా రవితేజే కావడం విశేషం. కృష్ణ అనిల్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఈవ్ టీజింగ్ అంశాలను ఉద్దేశించి రూపొందించారు. ఇలాంటివి మన కళ్లముందు జరిగినపుడు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి అనే కాన్సెప్టుతో ఈ రియాక్ట్ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు.
తమవారు బాగుంటే చాలని కోరుకునే ఈ కాలంలో ఎదుటి వారికి కూడా సాయం చేయాలంటూ సందేశం ఇస్తూ ఈ షార్ట్‌ ఫిల్మ్ నిర్మించిన రవితేజ, దర్శకత్వం వహించిన కృష్ణ అనిల్‌పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ సిటీ బస్సులో ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. రాత్రి వేళ ఓ అమ్మాయి ఒంటరిగా ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో ఇద్దరు అమ్మాయిలు తమ తండ్రి, సోదరుడితో కలిసి బస్సెక్కుతారు. తర్వాత ముగ్గురు ఆకతాయిలు బస్సు ఎక్కి ఒంటరిగా ఉన్న అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసిన ఇద్దరు అమ్మాయిల తండ్రి, సోదరుడు అలా చేస్తున్న వారిపై రియాక్ట్ అవ్వకుండా మిన్నకుండిపోతారు. తమ పక్కన ఉన్న ఆడపిల్లలకు జరుగడం లేదుకదా, మనకెందుకు అనే ధోరణిలో మిన్నకుండిపోతారు.

Recommended