• 6 years ago
Nela Ticket cinema review.

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రాజా ది గ్రేట్‌తో బంపర్ హిట్‌ను సొంతం చేసుకొన్న రవితేజ.. ఆ తర్వాత టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. అయితే కల్యాణ్ కృష్ణ మాత్రం రెండు బ్లాక్‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకొని హ్యాటిక్ విజయం కోసం రామ్ తాళ్లూరి నిర్మాతగా నేల టికెట్‌ను రూపొందించారు. రవితేజతో కొత్త భామ మాళవిక శర్మ జతకట్టింది. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్‌లుక్‌‌లు భారీగా అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో మే 25న నేల టికెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో కల్యాణ్ కృష్ణ హ్యాట్రిక్ కొట్టాడా? రవితేజ ఖాతాలో మరో విజయం చేరిందా? అనే తెలుసుకోవాలంటే అసలు కథ, కథనాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్‌ ఏంటో తెలుసుకోవాల్సిందే.
నేల టికెట్ రవితేజ ఓ అనాధ. సేవా గుణం కలిగిన రాజకీయ వేత్త ఆనంద భూపతి (శరత్ బాబు) చేరదీసి ఆదరిస్తాడు. ఆనంద భూపతిని స్వయంగా తన కుమారుడు మినిస్టర్ (అజయ్ భూపతి) హత్య చేస్తాడు. ఆ విషయాన్ని జర్నలిస్టు (కౌముదీ) కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ విషయం తెలుసుకొన్న అజయ్ భూపతి జర్నలిస్టుపై దాడి చేస్తాడు. ఈ క్రమంలో అజయ్ భూపతి ఆగడాలను ఎదుర్కొంటూ, అతడు వేసే ఎత్తులకు పైఎత్తు వేస్తుంటాడు.
అజయ్ భూపతిని అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు? రవితేజ అనుకొన్న లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు? జర్నలిస్టుతో నేలటికెట్టుకు ఉన్న సంబంధం మేమిటి? ఆనంద భూపతిని అజయ్ భూపతి ఎందుకు చంపాడు? ఈ కథలో డాక్టర్(మాళవిక శర్మ)తో నేలటికెట్టు సాగించిన ప్రేమయాణం కథకు ఎలా ఉపయోగపడింది అనే ప్రశ్నలకు సమాధానమే నేల టికెట్టు కథ.

Recommended