• 6 years ago
Bharat Ane Nenu cinema review: Maheshbabu's another Magic.Bharat Ane Nenu world wide grand release today

దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రిన్స్ మహేష్‌బాబు ఒకరు. ఆయన నటించిన చిత్రాలు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రిన్స్ నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ప్రిన్స్ కెరీర్‌లో తప్పనిసరిగా హిట్టు కావాల్సిన తరుణంలో ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందుకోసం శ్రీమంతుడు అందించిన దర్శకుడు కొరటాల శివతో జతకట్టాడు. ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గత చిత్రాల కంటే మిన్నగా మ్యాజిక్ సాధించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
భరత్ (మహేష్‌బాబు) రాజకీయ వేత్త రాఘవ (శరత్ కుమార్) కుమారుడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో లండన్‌లో పెరుగుతాడు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డిగ్రీలు పొందుతాడు. తండ్రి ఆకస్మిక మరణంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. సీఎంగా మారిన భరత్.. వసుమతి అనే ఎంబీఏ విద్యార్థి ప్రేమలో పడుతాడు. సీఎం పదవి చేపట్టిన భరత్ అనూహ్య నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్నల్ని పొందుతాడు. కానీ ఓ కారణంగా సీఎం పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత తండ్రి మరణం సహజం కాదనే విషయం తెలుస్తుంది.
అద్భుతమైన పాలనను అందిస్తున్న భరత్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? తండ్రి ఎలా చనిపోయాడు. తండ్రి మరణం వెనుక ఉన్న వ్యక్తులపై ఎలాంటి పగను తీర్చుకొన్నాడు? వసుమతి ప్రేమ కోసం భరత్ ఏం చేశాడు? సీఎం పీఠాన్ని భరత్ తిరిగి ఎలా దక్కించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే భరత్ అనే నేను చిత్ర కథ.
లండన్‌లో భరత్ లైఫ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకోకుండానే ప్రధాన కథలోకి సినిమా వెళ్తుంది. తండ్రి మరణంతో లండన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో తన బాల్యానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చకచకా సాగిపోతాయి. అనూహ్య పరిస్థితుల్లో భరత్ సీఎంగా మారడంతో సినిమా మరో మలుపు తిరుగుతుంది. కథలో వేగం పెరగడంతో వినోదంతో చక్కగా సాగిపోతుంది. తొలిభాగంలో ప్రకాశ్ రాజ్ (నానాజీ), మహేష్‌బాబు మధ్య సన్నివేశాలు గ్రిప్పింగ్ ఉండటంతో సినిమాపై పట్టు బిగుస్తుంది. ఓ ఆసక్తికరమైన సన్నివేశంతో సినిమా ప్రథమార్థం ముగుస్తుంది.

Recommended