• 7 years ago
Kalyan Ram's MLA, short for Manchi Lakshanulla Abbayi had hit the screens this Friday. Kajal Agarwal is the Heroine. Kalyan Ram is perfect in the central character of MLA. He looks handsome and fit in his new look.

నందమూరి కల్యాణ్ రామ్ మంచి అభిరుచి ఉన్న తెలుగు హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా. కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ఎంఎల్ఏ. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి సినిమాకు ట్యాగ్‌లైన్. పొలిటికల్ సౌండ్ ఎక్కువగా వినిపించే ఈ చిత్రం కల్యాణ్ రామ్‌కు ఎలాంటి సక్సెస్ అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఎంఎల్ఏ సినిమాను సమీక్షించాల్సిందే.
అనంతపురం జిల్లా వీరభద్రపురంలో గాడప్ప (రవికిషన్), నాగప్ప (జయప్రకాశ్ రెడ్డి) కుటుంబాల మధ్య రాజకీయవైరం ఉంటుంది. ఎన్నో ఎలెక్షన్లలో నాగప్పపై, ఆయన కుటుంబంపై గాడప్ప గెలుస్తూనే ఉంటాడు. ఓ కారణం చేత ఆ నియోజకవర్గంలో గాడప్పపై కల్యాణ్ (కల్యాణ్ రామ్) రాజకీయ సవాల్ విసురుతాడు. రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని విసిరిన కల్యాణ్‌ సవాల్‌కు గాడప్ప సై అంటాడు.
రాజీనామా చేసిన గాడప్ప ఉపఎన్నికల్లో గెలిచాడా? ఎన్నో ఏళ్లుగా గెలుస్తున్న గాడప్పను ఎన్నికల్లో కల్యాణ్ ఏవిధంగా దెబ్బతీశాడు. తాను ప్రేమించిన ఇందు (కాజల్ అగర్వాల్)కు నాగప్ప కుటుంబంతో సంబంధమేమిటి? ఏ పరిస్థితుల్లో కల్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు కల్యాణ్ ఎలా చరమగీతం పాడాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఎంఎల్ఏ సినిమా కథ.
అమ్మాయికి ఆస్థులు పంచి ఇస్తే అవి ఉన్నంతకాలం బతుకుతారు.. అదే చదువు చెప్పిస్తే జీవితాంతం జీవిస్తారు అనే ఓ మంచి పాయింట్‌తో సినిమా తెరకెక్కింది. తొలి భాగంలో వీరభద్రపురంలో రాజకీయ ఫ్యాక్షన్‌తో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత తన చెల్లెలు (లాస్య) ప్రేమించిన వ్యక్తి (వెన్నెల కిషోర్) పెళ్లి మరో అమ్మాయితో జరుగుతుంటే ఎత్తుకొచ్చే పెళ్లి సీన్‌తో హీరో కల్యాణ్ రామ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చెల్లెల్ని పెళ్లి చేయడం వల్ల కల్యాణ్ రామ్, చెల్లెలి కుటుంబంతో సహా బయటకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కాజల్ అగర్వాల్‌తో పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ఇందు ఓ సమస్యలో ఇరుక్కోవడంతో కథ ఇంటర్వెల్‌కు చేరి కొత్త మలుపుతిరుగుతుంది.
ఇంటర్వెల్‌లో తర్వాత ఇందు కోసం వీరభద్రపురం గ్రామానికి వెళ్లడం, అక్కడి పరిస్థితలు చూసి కల్యాణ్ రామ్ చలించడం సినిమా రెండోభాగంలో చకచకా సాగిపోతుంటాయి. ఇక ఇందును పెళ్లి చేసుకోవడానికి ఎంఎల్ఏ కావాలనే షరతుతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అలా గాడప్ప వేసే ఎత్తులకు కల్యాణ్ ఎలా పై ఎత్తులు వేశారనే సినిమా ముగింపుకు సమాధానం.
దర్శకుడిగా ఉపేంద్ర మాధవ్‌‌కు ఇది తొలి సినిమా. పక్కా కమర్షియల్ హంగులతో, హీరోయిజానికి పెద్ద పీట వేసి రాసుకొన్న కథ ఇది. ఫ్యాక్షన్, పొలిటికల్, లవ్ లాంటి అంశాలను కలబోసిన ఊరమాస్ చిత్రం ఎంఎల్ఏ. అయితే దర్శకుడు తన తొలి చిత్ర కథను, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదేమో.

Recommended