పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

  • 6 years ago
Cine critic Mahesh Kathi said that he will contest on Jana Sena chief Pawan Kalyan as independent in coming elections.


తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తానని సినీ విమర్శకుడు మహేష్ కత్తి చెప్పారు. ఆదివారం హైదరాబాదు ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ చర్చలో పాల్గొన్నారు. మీ వెనక ఎవరున్నారని అడిగితే తన వెనక ఎవరూ లేరని సమాధానమిస్తూ తాను వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తానని, ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

తనను చంపాలన్నట్లు పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని కత్తి మహేష్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించడం నేరమని అంటూ పవన్ కల్యాణ్ దీన్ని ఎందుకు ఖండించడం లేదని మహేష్ కత్తి ప్రశ్నించారు. దానికి మీడియా ప్రతినిధుల స్పందిస్తూ చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చి చంపిన తప్పులేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు కదా, దాన్ని మీరు ఖండించారా అని అడిగారు.
జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యను తాను ఖండించానని, ప్రజాస్వామ్యంలో హింసకు ఎవరూ మద్దతివ్వరని, ఆ మాట ఎవడన్నా తప్పేనని, జగన్ అన్నా తప్పేనని, ఏమిటిప్పుడు అని మహేష్ కత్తి అన్నారు.

Recommended